Bigg Boss 7 Telugu: అనవసరంగా అలా మాటలు అన్నప్పుడు.. ఎవడికైనా కాలుతుంది.. బజ్‌లో పూజా మూర్తి?

by Disha Web Desk 10 |
Bigg Boss 7 Telugu: అనవసరంగా అలా మాటలు అన్నప్పుడు.. ఎవడికైనా కాలుతుంది.. బజ్‌లో పూజా మూర్తి?
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్‌బాస్‌ 7 నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి యొక్కరు గీతూ రాయల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బజ్ లో ఓ ఇంటర్వ్యూ తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే గీతూ దరిద్రం ఏంటో కానీ ఆమె ఇప్పటి వరకు ఒక్క అబ్బాయిని కూడా ఇంటర్వ్యూ చేయలేదు. ఎందుకంటే 7 వారాల్లో ఇప్పటి వరకు అందరూ అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడో వారం పూజా మూర్తి ఎలిమినేట్ అయింది.

ప్రోమో మొదట్లోనే మీకు రెండు నామినేషన్స్ పడ్డాయి.. దీనిలో ఏది తుప్పాస్ నామినేషన్ అని మీకు అనిపించింది అని గీతూ అడిగింది. అప్పుడు పూజా తేజ ఫోటోను చించేస్తూ వీడు చెప్పింది తుప్పాస్ రీజన్ అంటూ అనేస్తుంది. ఇక వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన మీరు చాలా వై ఆడతారని మేమంతా అనుకున్నాం అని గీతూ అంది. అయ్యో నాకు దెబ్బ తగులుతుంది .. నాకు నొప్పిగా ఉందనే ఆడ పిల్లలు కేవలం టీవీ చూసుకుంటూ ఇంట్లోనే కూర్చోవాలి .. ఇట్లాంటి వాటికి రాకూడదు.. అని ఘాటుగా సమాధానమిచ్చింది పూజ. మిగిలిన వాళ్లు మీకంటే హౌస్‌లో ఉండటానికి అర్హులని మీరు అనుకుంటున్నారా అని గీతూ అడిగితే అశ్విని, భోలే కాదని పూజ సమాధానమిచ్చింది. రీజన్ ఏంటని అడిగితే ఎవరో నిన్ను పై నుంచి కింద వరకు చూసి ఆ నువ్వు ఫిజికల్లీ స్ట్రాంగే నాకు తెలుసు అన్నప్పుడు ఎవరికైనా కాలుతుంది.. ఎవరికైనా కాలిపోతుంది అంటూ పూజ రెయిజ్ అయింది.

Next Story