Virupaksha Tv Premiere : ‘స్టార్‌ మా’లో ‘విరూపాక్ష’.. ఎప్పుడో తెలుసా?

by Disha Web Desk 9 |
Virupaksha Tv Premiere : ‘స్టార్‌ మా’లో ‘విరూపాక్ష’.. ఎప్పుడో తెలుసా?
X

దిశ, సినిమా: మెగా హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత నటించిన చిత్రం ‘విరూపాక్ష’. హర్రర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే ఓటీటీలో దుమ్మురేపిన మూవీ టీవీలోకి రాబోతుంది. జూన్ 25న సాయంత్రం ఆరు గంట‌ల‌కు ‘స్టార్‌ మా’లో టెలికాస్ట్ కానుంది. ఇక ఈ సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ‌, హిందీ భాష‌ల‌కు సంబంధించిన శాటిలైట్ రైట్స్‌ను స్టార్ గ్రూప్ సొంతం చేసుకున్నది. ఈ శాటిలైట్ హ‌క్కుల కోసం దాదాపు స్టార్‌ మా రూ.10 కోట్లకు పైగా వెచ్చించిన‌ట్లు స‌మాచారం.

Next Story