ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని 2020లోనే చెప్పింది.. ట్వీట్ వైరల్

by Disha Web Desk 7 |
ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని 2020లోనే చెప్పింది.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: ‘ఊసరవెల్లి’ మూవీలో తమన్న ఫ్రెండ్ గా నటించిన పాయల్ ఘోష్‌ తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక గతంలో పాయల్ ఘోష్ ట్విట్టర్‌లో ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పని లేదు. విషయానికొస్తే రెండు మూడేళ్ల క్రితం ట్విట్టర్‌లో మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మధ్య పెద్ద యుద్ధం జరిగింది. మీరా చోప్రా తనకు ఎన్టీఆర్ ఎవరో తెలియదు అన్నట్టుగా మాట్లాడడంతో.. తారక్ ఫ్యాన్స్ ఆమెను దారుణంగా ట్రోల్ చేయడం, తిరిగి ఆమె కూడా వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

అయితే ఈ వివాదం మధ్యలోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ ‘ఎన్టీఆర్ గొప్ప నటుడు. ఆయనతో కలిసి నటించాను. గ్లోబల్ స్టార్ అవుతాడు’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె NTR ఫ్యాన్స్‌కు బాగా దగ్గరైంది. అయితే తాజాగా ‘RRR’ మూవీ ఆస్కార్ అందుకున్న సందర్భంలో మరో ట్వీట్ చేసింది నటి. ‘ఆస్కార్ కంటే ముందే 2020లో నేను చెప్పాను. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని...నేను తప్పు చెప్పను’ అని పోస్ట్ పెట్టి తారక్‌పై అభిమానాన్ని ఈ విధంగా ప్రదర్శించింది పాయల్.

Next Story

Most Viewed