‘ఈషా’ కథ చెప్పగానే ఎంతో షాకింగ్‌గా అనిపించింది..:ఫుల్ ఎగ్జైట్ అయ్యాను

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 14:07:34  IST  )

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఓహారర్‌ థ్రిల్లర్‌ ‘ఈషా’ (eshaa)చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.

‘ఈషా’ కథ చెప్పగానే ఎంతో షాకింగ్‌గా అనిపించింది..:ఫుల్ ఎగ్జైట్ అయ్యాను
X

దిశ, సినిమా: ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ఓహారర్‌ థ్రిల్లర్‌ ‘ఈషా’ (eshaa)చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. ఇటీవల ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ మూవీతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌(Akhilraj)తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తుండగా.. ఇందులో హెబ్బాపటేల్‌(Hebba Patel) కథానాయికగా కనిపించనుంది. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో అఖిల్‌ రాజ్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడి పలు విశేషాలు పంచుకున్నారు. ‘‘ఈషా’ కథ చెప్పగానే ఎంతో షాకింగ్‌గా అనిపించింది. నేను ఎంతో ఎగ్జైట్ అయ్యాను. తప్పకుండా హారర్‌ థ్రిల్లర్‌ సినిమాలు చూసే వారికి కొత్త అనుభూతినిస్తుంది.

ఇందులో ట్విస్టులు, సౌండ్‌ డిజైనింగ్‌ సూపర్భ్‌‌గా ఉన్నాయి. ఇందులో నేను వినయ్‌ అనే పాత్రను చేస్తున్నాను. నలుగురు చిన్నప్పటి స్నేహితుల్లో నేను ఒకర్ని. త్రిగుణ్‌, సిరి, హెబ్బా పటేల్‌, మైమ్‌ మధు వంటి మంచి నటులతో‌ కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్‌ రాగా నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. ఫలితం ఆశించకుండా కష్టపడాలి. యూనివర్శ్‌ మనకు కావాల్సిన ఫలితం ఇస్తుందని నా నమ్మకం. కంటెంట్‌ బాగున్న సినిమాను ఎవరూ ఆపలేరు. నాకు ‘ఈషా’ ఓ గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాను’’ అన్నారు.

Next Story