- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పేరుతో మోసం...మాల్యా కొడుకు బండారం బయటపెట్టిన హీరోయిన్ ?
బిల్ కట్టమని సిద్ధార్థ్ వెళ్లిపోయాడట. ఈ తరుణంలోనే.. బ్రేకప్ జరిగినట్లు దీపికా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు

దిశ, వెబ్ డెస్క్ : విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ముందుండి నడిపించారు. అయితే బ్యాంకులకు ఇవ్వాల్సిన డబ్బుల నేపథ్యం, ఇతర కారణాల వల్ల లండన్ కు వెళ్ళిపోయింది ఈ కుటుంబం. అయితే... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 సంవత్సరాలు తర్వాత టైటిల్ గెలవడంతో... విజయ్ మాల్యా అలాగే సిద్ధార్థ మాల్యా గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా సిద్ధార్థ్ మాల్యా, దీపికా మధ్య ఉన్న రిలేషన్ గురించి కూడా చర్చ జరుగుతోంది. 2011 సంవత్సరం సమయంలో... వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందట. అయితే.... వీళ్ళిద్దరూ కొన్ని అనివార్య కారణాలవల్ల విడిపోయారు. కానీ తాజాగా... హోటల్ లో బిల్ కట్టకపోవడం వల్ల.... సిద్ధార్థ మాల్యాకు బ్రేకప్ చెప్పారట దీపిక. మొదట్లో వీళ్లిద్దరు కలిసే ఉండేవారట.
దీపికా... ఏది అడిగినా కూడా కొనుగోలు చేసి.. గిఫ్టుగా ఇచ్చేవాడట సిద్ధార్థ. కానీ.. ఆ తర్వాత సిద్ధార్థ బిహేవియర్ లో చాలా మార్పులు...వచ్చాయని అప్పటల్లో దీపికా చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. ఇక చివరలో డిన్నెర్ కు వెళితే... అక్కడ తననే బిల్ కట్టమని సిద్ధార్థ్ వెళ్లిపోయాడట. ఈ తరుణంలోనే.. బ్రేకప్ జరిగినట్లు దీపికా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం. అయితే.. ఇప్పుడు ఈ విషయం వైరల్ చేస్తున్నారు.






