నాకు కొడుకు లేడు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజయ శాంతి

by Chukka Sudharani |

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతి గురించి పరిచయం అక్కర్లేదు.

నాకు కొడుకు లేడు.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజయ శాంతి
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతి గురించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌తో రాణించారు విజయశాంతి. ఇక ప్రస్తుతం ఈ నటి రాజకీయాల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఇప్పుడు విజయశాంతికి 25 ఏళ్ళ కొడుకు ఉన్నాడనే వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన ఆమె.. ‘నేను పెళ్లి చేసుకున్న తర్వాత సమాజానికి సేవ చేయడం కోసం పిల్లల్ని కనకూడదని అనుకున్నా. నాకు పిల్లలు లేరన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. ఇలాంటి పుకార్లు వద్దు. ప్రస్తుతం నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నా. అలాగే మంచి పాత్రలు వస్తే సినిమాలో నటించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను’ అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసింది.

Next Story