- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఆ విషయం గురించి అందరూ చెప్పేస్తున్నారు.. కానీ, రామ్ చరణ్ సైలెంట్ వెనుక కారణమేంటి?
దిశ, సినిమా: మెగా కుటుంబం మొత్తం సంతోషంలో మునిగి తేలుతుంది. పదేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చక్రం తిప్పడంతో మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకున్నారు. దీంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతా ఓకే కానీ, రామ్ చరణ్ విషయంలో మెగా ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. చరణ్ అభిమానులను ఇబ్బంది పెడుతున్న ఆ కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ప్రస్తుతం ఇండియా మొత్తం ప్రభాస్ మ్యానియా కొనసాగుతుంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'కల్కి 2898 AD' ఈ నెల 27న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విడుదల తేదీపై చిత్ర బృందం కొద్దిరోజుల క్రితమే క్లారిటీ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ తర్వాత, లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ కూడా అతి త్వరలో తెరపైన కనిపించనున్నాడు. దేవర మూవీ అక్టోబర్‌లో విడుదల కావాల్సి ఉంది కానీ ఇప్పుడు సెప్టెంబర్ 27 విడుదల తేదీకి సిద్ధమవుతోంది. పుష్ప 2 విడుదల తేదీని కూడా అల్లు అర్జున్ అనౌన్స్ చేసాడు. ఆగస్టు 24న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 15కి వాయిదా వేసినట్లు ప్రకటించారు.
ఇలా అందరూ వాళ్ళ సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తుంటే రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నాడు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ తేదీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో చరణ్ ఫ్యాన్స్ రిలీజ్ డేట్ చెప్పండంటూ.. రిక్వెస్ట్ చేస్తున్నారు.