షర్మిల పార్టీతో నాకేంటి సంబంధం.. స్టార్ హీరో భార్య సీరియస్

by Disha Web Desk 7 |
షర్మిల పార్టీతో నాకేంటి సంబంధం.. స్టార్ హీరో భార్య సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఆయా పార్టీల నుంచి ఇప్పటికే అభ్యర్థుల జాబితాలు కూడా విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్ కూడా పోటీ చేసేందుకు ఏకంగా నాలుగు అసెంబ్లీ స్థానాల నుంచి ధరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో జీవితా రాజశేఖర్ వైఎస్ఆర్‌టీపీతో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన జీవితా ‘నేను ఇప్పుడు బీజేపీ పార్టీ‌లో ఉన్నాను. నాకు వైఎస్ఆర్‌టీపీతో ఎటువంటి సంబంధం లేదు. మీడియా గ్రూప్‌‌లో సర్క్యూలేట్ చేస్తోన్న ఫొటోలు చాలా సంవత్సరాల క్రితం దిగినవి. ఆర్‌జీవీ ‘వ్యూహం’ సినిమా వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఆ సినిమాను కూడా చూస్తాను. ఆ సినిమా గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. అయినా ఇప్పుడెందుకు నా గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు’ అంటూ ఫైర్ అయింది.



Next Story

Most Viewed