ఆ విషయంలో చరణ్ నాకు నచ్చేవాడు కాదు : నాగబాబు

by Chukka Sudharani |

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ బర్త్‌డే‌ను ఫ్యాన్స్ పండుగల జరుపుకుంటున్నారు.

ఆ విషయంలో చరణ్ నాకు నచ్చేవాడు కాదు : నాగబాబు
X

దిశ, సినిమా: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ బర్త్‌డే‌ను ఫ్యాన్స్ పండుగల జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే గ్రాండ్‌గా ఓ ఈవెంట్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నాగబాబు.. ‘మేము మొత్తం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కలిపి ఐదుగురం. మా తరంలో మొదటి సంతానం చరణ్. అన్న కొడుకు అయినా మేము ఎప్పుడు అలాంటి భేదం చూపించలేదు. మా చెల్లెలు పిల్లలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే రామ్ చరణ్ వద్దకు వెళ్లి తన సలహాలు, సూచనలు తీసుకుంటారు. చరణ్ చాలా మెచ్యూరిటీ‌గా ఆలోచిస్తాడు. ఆ విషయంలో చరణ్ బాబుని చూసినప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇలా ఉన్నాడు కానీ.. ఒకప్పుడు చాలా కోపంగా ఉండేవాడు. ఏమీ ఆలోచించకుండా మాట్లాడేవాడు. అప్పుడు నాకు అసలు నచ్చేవాడు కాదు. కాలంతో పాటు తనలో చాలా మార్పులు వచ్చాయి’ అని చెప్పుకొచ్చాడు.

Next Story