- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్‌తో పోటీ పడటం కంటే మంచి మార్గం ఏముంటుంది: ఇమ్రాన్ హష్మీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజిత్(Sujith) కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘ఓజీ’.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజిత్(Sujith) కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘ఓజీ’. ఈ సినిమా కోసం సినీ ప్రియులతో పాటు సెలబ్రిటీలు సైతం ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi)విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ ‘ఓజీ’మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘ఈ సినిమా కోసం నన్ను సంప్రదించినప్పుడు నేను చాలా థ్రిల్ అయ్యాను. ఎందుకంటే ఈ సినిమాతో నేను తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తాను కాబట్టి సంతోషంగా అనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పోటీ పడటం కంటే దానికి మంచి మార్గం ఏముంటుంది?. దర్శకుడు సుజిత్, పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం. నా లుక్ నుండి, నా లైన్ల వరకు, నా క్యారెక్టరైజేషన్ వరకు - ‘ఓజీ’కి సంబంధించిన ప్రతిదీ నచ్చింది. ఈ సినిమాలో భాగం కావడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను’’అని చెప్పుకొచ్చాడు.






