- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Brahmamudi : వేరు కాపురం పెట్టబోతున్న రాజ్, కావ్య.. అసలు ఏమి జరిగిందంటే?
అపర్ణ ఎవరితో మాట్లాడకుండా తన పని తానే చేసుకుంటుంది

దిశ,వెబ్ డెస్క్ : అపర్ణ ఎవరితో మాట్లాడకుండా తన పని తానే చేసుకుంటుంది. అందరూ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తుంటే కావ్య అత్త అపర్ణ మాత్రం కోపంతో తను కుక్ చేసుకున్న అన్నాన్ని తీసుకొని సోఫా మీద కూర్చొని తినడానికి రెడీ అవుతుంది. ఏంటి ఇలా చేస్తుందని .. ఇంట్లో వాళ్లంతా చూసి షాక్ అవుతారు. ఇక్కడ అందరికీ కావ్య సిద్ధం చేసింది కదా.. నువ్వు ఒక్కదానివే అక్కడ కూర్చొని తింటావా అంటూ ఇందిరా దేవి అడుగుతుంది. దీంతో అది నేను వండింది కాదు కదా అత్తయ్య అంటుంది అపర్ణ. నేను వండింది.. నువ్వు వండింది అంటూ అని ఎప్పుడు మొదలైందని అడుగుతుంది. ఇప్పటి నుంచి నా వంట నేనే చేసుకుంటా.. నా పనులు నేనే చేసుకుంటా.. అని అపర్ణ అంటుంది. దీంతో విడిపోవాలని ఉద్దేశం నీకు ఉన్నప్పుడు వంటింట్లో మాత్రమే ఎందుకు ఇంట్లో కూడా విడిపోవాలి.. ఆస్తులు పంచుకొని ఎవరి కాపురాలు వాళ్లు వేరుగా పెట్టుకోండి అని అంటుంది ఇందిరా దేవి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు వేచి చూడాల్సిందే..!






