- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: ఆ రాష్ట్రంలో ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమా ప్రదర్శనపై నిషేదం
by Satheesh |
మత మార్పిడి నేపథ్యంలో తెరకెక్కిన ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: మత మార్పిడి నేపథ్యంలో తెరకెక్కిన ‘‘ది కేరళ స్టోరీ’’ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక వర్గాన్ని తప్పుగా చూపించారంటూ పలు రాష్ట్రాల్లో ది కేరళ స్టోరీ మూవీ ప్రదర్శనలు నిలిపివేయాలంటూ ఆందోళనలు జరగుతున్నాయి. ఇదిలా ఉండగానే.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ది కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనను బెంగాల్‌లో నిషేదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వర్గాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ సినిమా ఉందని.. ఈ నేపథ్యంలోనే ది కేరళ స్టోరీ మూవీపై బ్యాన్ విధిస్తున్నట్లు బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక, ఈ సినిమా విడుదలపై తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో స్టాలిన్ ప్రభుత్వం ఈ మూవీపై పాక్షిక నిషేదం విధించింది.
Next Story






