ఆటంకాలు వచ్చినా కష్టపడి తీశాం.. ‘గోట్’ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది:చంద్రశేఖర్

by Mallepaka Hamsa |

సుడిగాలి సుధీర్(Sudigali Sudheer), దివ్యభారతి (Divya Bharati)జంటగా నటించిన సినిమా ‘గోట్’(goat).

ఆటంకాలు వచ్చినా కష్టపడి తీశాం.. ‘గోట్’ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది:చంద్రశేఖర్
X

దిశ, సినిమా: సుడిగాలి సుధీర్(Sudigali Sudheer), దివ్యభారతి (Divya Bharati)జంటగా నటించిన సినిమా ‘గోట్’(goat). జైశ్నవ్ ప్రొడక్షన్ , మాహాతేజ క్రియేషన్స్‌లో అద్భుతం, టేనంట్ వంటి అద్బుతమైన చిత్రాలని నిర్మించిన మొగుళ్ళ చంద్రశేఖర్ గారి నిర్మాణంలో... క్రికెట్ నేపథ్యం లోనే కామెడీ ప్రధాన అంశంగా రూపొందించారు. తాజాగా, మేకర్స్ అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ సినిమాని బాధ్యతాయుతంగా తీశాము. మధ్యలో కొన్ని ఆటంకాలు వచ్చినా.. మళ్లీ రీవర్క్ చేసుకుని అద్భుతంగా తీర్చిదిద్దాం. ముందున్న టీము మాకు అంతగా సపోర్ట్ చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎవరో చేసిన తప్పులకి నిర్మాతగా నాలుగైదు రెట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టడం నేను తీసుకోలేకపోయాను. ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్ లాగా ఎంజాయ్ చేస్తారు.

అలాగే సొసైటీలో ఉన్న ఒక సమస్యను కూడా ఇందులో చూపించాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తారని నమ్మకం ఉంది. రవీంద్ర రెడ్డి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. మా హీరోయిన్ దివ్యభారతి గారు ఈ సినిమా ఒప్పుకోడమే చాలా ఆనందాన్నిచ్చింది. తనకి తెలుగులో ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. నితిన్ ప్రసన్న గారు ఇందులో మెయిన్ విలన్ గా చేశారు. ఆయన మాకు దొరకడం గాడ్ గిఫ్ట్. లియన్ జేమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం మణిశర్మ గారు పనిచేస్తున్నారు. ఆయన సపోర్టు మర్చిపోలేను. ఆయన లెజెండ్. ఈ కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమా చేస్తున్నానని చెప్పారు, పోస్ట్ ప్రొడక్షన్ అద్భుతంగా వచ్చింది త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము’’ అన్నారు.

Next Story