- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా కోసం కష్టపడేది మేము.. ఫలితం దక్కేది మాత్రం వాళ్లకంటూ నిర్మాత ఎస్‌కేఎన్ సంచలన పోస్ట్
ఐబొమ్మ రవి (Ravi)ఇష్యూ రోజు రోజుకు ముదురుతోంది.

దిశ, సినిమా: ఐబొమ్మ రవి (Ravi)ఇష్యూ రోజు రోజుకు ముదురుతోంది. కొంతమంది ఆయనను జైల్లో ఉంచడమే మంచిది అంటుంటే.. సినీ ప్రియులు మాత్రం విడుదల చేయాలని కోరుతున్నారు. ఓ వైపు టికెట్ రేట్లు పెరగడం వల్లే ఐబొమ్మ లాంటి యాప్ ద్వారా రవి ఎంతోమందికి ఫ్రీ సినిమాలు చూపిస్తున్నాడని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, నిర్మాత ఎస్‌కేఎన్ (SKN)ఓ సంచలన ట్వీట్ పెట్టాడు. ‘‘కష్టపడి దర్శకుడుని పట్టుకొని కథ చేయించుకొని హీరోని ఒప్పించి డబ్బులు అప్పులు చేసి సినిమా తీసే నిర్మాతకి ఒక ఫామిలీ మల్టీప్లెక్స్‌లో 2200 ఖర్చు చేస్తే ఎంత మిగులుతుందో ఇది డిటైల్డ్ ఎనాలిసిస్ జస్ట్ 17%.
పాప్కార్న్ సమోసా కూల్ డ్రింక్ థియేటర్ యాడ్స్‌తో నిర్మాతకి పైసా సంభంధం ఉండదు. నలుగురు ఉన్న ఒక కుటుంబం.. సినిమా చూడటానికి ఖర్చు చేసే ₹2178 రూపాయలు. ఇందులో సుమారు 71% మొత్తాన్ని మల్టీప్లెక్స్‌లు స్వాధీనం చేసుకుంటున్నాయి. ఇందులో ప్రధాన పాత్ర పోషించేది ఫుడ్ అండ్ బేవరేజెస్. ఒక కుటుంబం కొనుగోలు చేసే పాప్‌కార్న్, కూల్‌డ్రింక్, సమోసా వంటి ప్రతి వస్తువు GST మినహా పూర్తిగా మల్టీప్లెక్స్ ఆదాయమే. అంతేకాదు టికెట్ ధరలో ఉండే మల్టీప్లెక్స్ వాటా కన్వీనియన్స్ ఫీజులో వారికి లభించే భాగం అంతా కలిపి వారి ఆదాయం అసాధారణంగా పెరిగిపోతుంది.
భారీ బడ్జెట్ పెట్టడం, రిస్క్ మొత్తం భరించడం, టెక్నీషియన్స్ ఎంపికతో పాటు అన్ని ఏర్పాట్లు చేయడం నిర్మాత బాధ్యత. అయినప్పటికీ, ప్రేక్షకుడు ఖర్చు చేసే ₹2178లో నిర్మాతకు దక్కేది కేవలం ₹372 మాత్రమే. అంటే ప్రేక్షకుడు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో 17 పైసలు మాత్రమే నిర్మాత చేతికి వస్తాయి. మిగతా భాగం మొత్తం ఇతర వ్యవస్థలకు వెళ్లిపోతుంది. ప్రభుత్వం GST రూపంలో 8.36% తీసుకుంటుంది. ఇది నిర్మాతకు తిరిగి వచ్చే డబ్బులో భాగం కాకపోవడంతో నిర్మాత లాభాన్ని ఇది ఎంతమాత్రం ప్రభావితం చేయదు’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.






