న్యాయం కోసం ప్రధాని మోదీ దగ్గరికైనా వెళ్తాము.. ‘కపుల్ ఫ్రెండ్లీ’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-15 10:03:31  IST  )

‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాపై 'A' సర్టిఫికెట్ అనే రాంగ్ ముద్ర వేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ను దూరం చేశారని ఆయన వాపోయారు.

న్యాయం కోసం ప్రధాని మోదీ దగ్గరికైనా వెళ్తాము.. ‘కపుల్ ఫ్రెండ్లీ’ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Shobhan), మానస వారణాసి(Manasa Varanasi) జంటగా నటించిన తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అశ్విన్ చంద్రశేఖర్(Ashwin Chandrasekhar) దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి ప్రధాన కారణం సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'A' సర్టిఫికెట్ ఇవ్వడమేనని మేకర్స్ ఆరోపిస్తున్నారు.ఈ విషయంపై నిర్మాత ధీరజ్ మొగిలినేని మీడియా ముందు ఎమోషనల్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాపై 'A' సర్టిఫికెట్ అనే రాంగ్ ముద్ర వేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ను దూరం చేశారని ఆయన వాపోయారు.

దిల్ రాజు కూడా ఏం చేయలేమన్నారు..

‘‘ఈరోజు శివరాత్రి పండుగ కావడంతో ఫ్యామిలీలు, పిల్లలతో కలిసి సినిమా చూడాలనుకున్నా.. ఈ సర్టిఫికేషన్ వల్ల వారు థియేటర్లకు రాలేకపోతున్నారు. దీనివల్ల సినిమాకు ఎంత అప్రిసియేషన్ వచ్చినా, నిర్మాతగా మాకు దక్కాల్సిన రెవెన్యూ రావడం లేదు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ సినిమాకే కాకుండా, ఈ ఏడాది దాదాపు ఐదు చిత్రాలకు ఇలాంటి U/A సర్టిఫికెట్ సమస్యలు ఎదురయ్యాయని ఆయన గుర్తు చేశారు. సెన్సార్ బోర్డు నిబంధనల వల్ల టాలీవుడ్ నిర్మాతలు నష్టపోతున్నారని, ఈ సమస్యపై టాలీవుడ్ పెద్ద దిల్ రాజును సంప్రదించినా ఫలితం లేకపోయిందని ధీరజ్ తెలిపారు. ‘‘సెన్సార్ నిర్ణయాలు ముంబై నుంచి వస్తున్నాయి కాబట్టి మేము ఏమీ చేయలేమని దిల్ రాజు గారు అన్నారు. కానీ, మా బాధను చెప్పుకోవడానికి అవసరమైతే ప్రధాని మోదీ దగ్గరికైనా వెళ్లి మా బాధను చెప్పుకుంటాం మాకు న్యాయం జరగుతుందేమో. ఇలాంటి సమస్యలు మా సినిమాకే కాదు ఇదొక్క సంవత్సరంలోనే దాదాపు ఐదు చిత్రాలు ఇవే సమస్యతను ఎదుర్కొన్నారు’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నిర్మాత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

కపుల్ ఫ్రెండ్లీ : మొదటిరోజు గట్టిగానే రాబట్టిందిగా

Next Story