- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గేమ్ ఛేంజర్’తో జీవితాలు అయిపోయాయి అనుకున్నాం.. దుమారం రేపుతున్న నిర్మాత కామెంట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గేమ్ చేంజర్’.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు(dilraaju), శిరీష్ రూ. 450 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది. అంతేకాకుండా నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత శిరీష్ ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అవడంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘‘రామ్ చరణ్ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం.
కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో మళ్లీ నిలబడుతామన్న నమ్మకం వచ్చిది. కేవలం 4 రోజుల్లోనే మా పరిస్థితి మారిపోయింది. అప్పుడు ఎలా ఉండేదో ఊహించుకోలేం. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఏమైపోయేదో అర్ధం కాలేదు. అందరూ మా పని అయిపోయిందని హేళన చేశారు. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ అయితే హీరో వచ్చి మాకు ఏమైనా సాయం చేశాడా? డైరెక్టర్ వచ్చి ఏమైనా చేశాడా అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్ చేసి మా పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు రామ్ చరణ్ కూడా అడగలేదు.
మీరెలా ఉన్నారు.. అని కూడా మమ్మల్ని అడిగివారు లేరు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు. అలాగే ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. సినిమా మాకు ఇష్టం ఉండటం వల్ల తీసుకున్నాం డబ్బులు పోగొట్టుకున్నాం. రెమ్యునరేషన్‌లో కొంత ఇవ్వాలని మేము ఎవరినీ అడగలేదు. అంత స్థాయికి మేము ఇంకా దిగజారిపోలేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు నిర్మాతపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.






