- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మారుతున్న రోజులతో మనం కూడా మారుతూనే ఉండాలి.. బోల్డ్ సినిమాలు చేయడంపై శ్రీలీల రియాక్షన్!
క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sree Leela) మరోసారి రవితేజ(raviteja)తో స్క్రీన్‌పై మాజిక్ చేసేందుకు రెడీ అయింది.

దిశ, సినిమా: క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sree Leela) మరోసారి రవితేజ(raviteja)తో స్క్రీన్‌పై మాజిక్ చేసేందుకు రెడీ అయింది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘మాస్ జాతర’(mass jathara). భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీలీల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు తెలుపుతోంది. తాజాగా, శ్రీలీల బోల్డ్ సినిమాలు చేయడం గురించి క్లారిటీ ఇచ్చింది. ‘‘రోజంతా బిజీగానే ఉండేదాన్ని. ఖాళీగా ఉన్న రోజులు చాలా తక్కువ. ఇప్పుడు కూడా ఒకవైపు కలర్‌ఫుల్ కాస్ట్యూమ్స్, మరోవైపు మెడిసిన్ చేస్తున్నా.
రెండూ పూర్తిగా భిన్నమైనవి. అందుకే బోర్ కొట్టవు. రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నా. నేను చేసే సినిమాలు కుటుంబమంతా కూర్చుని చూసేలా ఉండాలని అనుకుంటాను. ఇప్పటికీ నేను బోల్డ్ చిత్రాల గురించి ధైర్యంగా మా కుటుంబ సభ్యులతో మాట్లాడలేదు. నా వివాహం తర్వాత కూడా నా సినిమాలు లేదా పాత్రలు నా కుటుంబం చూడటానికి సౌకర్యంగా ఉండాలి. కానీ అసౌకర్యంగా ఉండకూడదని అనుకుంటున్నాను. ప్రతి మూవీకి అలాగే ఆలోచిస్తాను. బోల్డ్ పాత్రలు చేయాలనుకోవడం లేదు. కానీ మారుతున్న రోజులతో పాటు మనం కూడా మారుతూనే ఉండాలి కదా.. అందుకే ఎప్పటికీ ఇలాగే ఉంటాను అని చెప్పలేను. ఎంతో కొంత మార్పు రావచ్చు.
అలాగే ‘మాస్ జాతర’లో భిన్నంగా కొంచెం మాస్‌గా ప్రయత్నింగా.. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ఇప్పటినుంచి ఎంపిక చేసుకునే సినిమాలు డిఫరెంట్‌గా ఉండబోతున్నాయి.’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ‘మాస్ జాతర’ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా రాబోతుంది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ నెల చివర్లో ప్రేక్షకులను అలరించనుంది.
Read More : ఐదు లక్షలిస్తే తమన్నా ఆ పని చేస్తుంది.. బాంబ్ పేల్చిన నటి






