పరిశ్రమ కోసం త్యాగం చేశాం.. సినిమా వాయిదాపై పూజా హెగ్డే ఆసక్తకర పోస్ట్

by Mallepaka Hamsa |

ఒకే తేదీన రెండు పెద్ద సినిమాలు పోటీ పడటం కంటే, ఒకరికొకరు మద్దతుగా నిలవడం పరిశ్రమకు చాలా మంచిది. అందుకే త్యాగం చేశాం.

పరిశ్రమ కోసం త్యాగం చేశాం.. సినిమా వాయిదాపై  పూజా హెగ్డే ఆసక్తకర పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస ఫ్లాపులతో సతమతమవుతోంది. ఎలాగైనా సరే ఒక భారీ హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పూజాకు, అక్కడ కూడా అదృష్టం కలిసి రావడం లేదు. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ విడుదల వాయిదా పడటం ఇప్పుడు ఆమె అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా, సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, మౌని రాయ్, చుంకీ పాండే, రోహిత్ సరాఫ్, జిమ్మీ షీర్గిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే, ముందుగా ఈ సినిమాను జూన్ 5న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. కానీ జూన్ 4న ‘టాక్సిక్’ అనే మరో భారీ చిత్రం విడుదల కాబోతుండటంతో, అనవసరమైన పోటీ ఎందుకని భావించిన మేకర్స్ సినిమాను వారం రోజులు వెనక్కి నెట్టారు.

తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ.. పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. "ఒకే తేదీన రెండు పెద్ద సినిమాలు పోటీ పడటం కంటే, ఒకరికొకరు మద్దతుగా నిలవడం పరిశ్రమకు చాలా మంచిది. అందుకే త్యాగం చేశాం. ఆ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని గౌరవిస్తూ, మా సినిమా విడుదలను జూన్ 12కి మార్చుకున్నాము. ప్రేమ, వినోదం పంచేందుకు జూన్ 12న థియేటర్లలో కలుద్దాం" అంటూ ఒక నోట్ షేర్ చేసింది. పూజా హెగ్డేకు గత కొంతకాలంగా ఏదీ కలిసి రావడం లేదు. పెద్ద హీరోలతో చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె ఎంతో ఆశలు పెట్టుకున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీ కూడా వాయిదా పడటంతో, ఆమెకు బ్యాడ్ టైమ్ నడుస్తోందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. జూన్ 12న విడుదల కాబోతున్న ఈ సినిమాతోనైనా పూజా హెగ్డే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story