చివరి గమ్యస్థానానికి చేరుకున్నాం.. ‘పరాశక్తి’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరాశక్తి’(Parashakthi).

చివరి గమ్యస్థానానికి చేరుకున్నాం.. ‘పరాశక్తి’ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పరాశక్తి’(Parashakti). ఇది ఆయన కెరీర్‌లో 25వ ప్రాజెక్ట్‌గా రాబోతుండటం విశేషం. ఈ సినిమాను ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్ సుధా కొంగర(Sudha Kongara) తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవి మోహన్, అథర్వ మురళి, రానా దగ్గుబాటి, మేసిల్ జోసెఫ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. డాన్ పిక్చర్స్, రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది జనవరి 14న సంక్రాంతి కానుకగా.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రాబోతుంది. తాజాగా, ‘పరాశక్తి’ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. శివ కార్తికేయన్, రవి మోహన్, అథర్వ మురళి కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఉన్న వీడియోను షేర్ చేశారు. ‘‘చివరి గమ్యస్థానానికి చేరుకున్నాం. షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే బ్లాస్ట్ కాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేస్తూ ఓ వెలిగించిన బాంబ్ ఎమోజీని పెట్టారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

link

Next Story