రాక్షసులు ఎక్కడో లేరు మనతోనే ఉన్నారు.. అతడిని ఉద్దేశించి రష్మీ చేసిన ట్వీట్ వైరల్

by Chukka Sudharani |   (  Updated:2023-06-11 12:54:43  IST  )

యాంకర్ రష్మీ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై పలు షోలు చేస్తూనే.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా మెరుస్తుంది ఈ అమ్మడు.

రాక్షసులు ఎక్కడో లేరు మనతోనే ఉన్నారు.. అతడిని ఉద్దేశించి రష్మీ చేసిన ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ రష్మీ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై పలు షోలు చేస్తూనే.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా మెరుస్తుంది ఈ అమ్మడు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రష్మీ యానిమల్ లవర్ అని తెలిసిందే. మూగ జీవాలకు ఏ రూపంలో అన్యాయం జరిగినా సహించలేదు. మూగజీవాలపై జరిగే ప్రతి హింసకి సోషల్ మీడియా వేధికగా తన గొంతు వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే.. తాజాగా రష్మీ షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. అత్యంత దారుణంగా ఉన్న ఈ వీడియోలో.. ‘‘చాలా మంది వ్యక్తులు తిమింగళాలను చంపుతున్నారు. పదుల సంఖ్యలో ఉన్న తిమింగలాల రక్తంతో సాగర తీరం మొత్తం ఎర్రగా మారిపోయింది’’ తిమింగలాలను చంపుతున్న వ్యక్తులను ఉద్దేశిస్తూ ‘‘రాక్షసులు ఎక్కడో లేరు. ఇలాంటి వాళ్ల రూపంలో మనతోనే ఉన్నారు’’ అంటూ క్యాప్షన్ ఇచ్చి పోస్ట్ చేసింది.

Also Read: అతడే డబ్బులు ఇచ్చి అలా చేయించాడు.. ఇకపై ఆపేద్దామనుకుంటున్నా: అనసూయ కామెంట్స్ వైరల్

Next Story