- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆ నీచమైన ఆలోచన మాకు లేదు’.. పుకార్లకు చెక్ పెడుతూ రవీనా టాండన్ సెన్సేషనల్ కామెంట్స్
నేను నా కెరీర్ మొత్తంలో ఎప్పుడూ పిఆర్ టీమ్‌ను పెట్టుకోలేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్(Raveena Tandon) తన కూతురు రాషా తడాని(Rasha Tadani)పై వస్తున్న నెగెటివ్ ప్రచారానికి చెక్ పెట్టారు. రాషా తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి ఇతర స్టార్ కిడ్స్‌పై సోషల్ మీడియాలో కావాలనే నెగెటివ్ పిఆర్ (PR) చేయిస్తోందంటూ వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. ‘యూయీ అమ్మ’ (Uyi Amma) సాంగ్ రిలీజ్ తర్వాతరాషా తన పీఆర్ టీమ్ ద్వారా ఇతర స్టార్ కిడ్స్‌ను తక్కువ చేస్తూ వార్తలు రాయిస్తోందని, తద్వారా తను గొప్పగా కనిపించాలని ప్రయత్నిస్తోందని కొందరు ఆరోపించారు. ఒక పాడ్‌కాస్ట్ సెషన్‌లో మాట్లాడిన రవీనా, ఈ రూమర్లను కొట్టిపారేశారు. "నేను నా కెరీర్ మొత్తంలో ఎప్పుడూ పిఆర్ టీమ్‌ను పెట్టుకోలేదు. మా కుటుంబానికి అలాంటి అలవాట్లు లేవు. మా కళ్ల ముందే పెరిగిన మా స్నేహితుల పిల్లల గురించి మేమెందుకు తప్పుగా ప్రచారం చేయిస్తాం?" అని ఆమె ప్రశ్నించారు. వేరే ఎవరినో తక్కువ చేసి చూపించి, తన కూతురు గొప్పగా అనిపించుకోవాలనుకునేంత నీచమైన ఆలోచన తమకు లేదని రవీనా స్పష్టం చేశారు.
విషపూరిత వాతావరణం ఏర్పడుతోంది..
నెటిజన్లు చేసే కామెంట్ల వల్ల అనవసరమైన విషపూరిత వాతావరణం ఏర్పడుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాషా విషయానికొస్తే.. గతేడాది అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆజాద్’ సినిమాతో రాషా తన కెరీర్ ప్రారంభించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా, అందులోని ‘యూయీ అమ్మ’ పాటలో రాషా డ్యాన్స్ మూమెంట్స్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ప్రస్తుతం అభయ్ వర్మతో కలిసి ‘లైకీ లైకా’ అనే సినిమాలో నటిస్తున్న రాషా, అందులో ‘ఛాప్ తిలక్’ అనే పాటతో గాయనిగా కూడా పరిచయమయ్యారు. మరోవైపు,తెలుగులో కూడా అజయ్ భూపతి దర్శకత్వంలో రాబోతున్న ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందులోఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






