వాళ్లను నమ్మి మేము దొరికిపోయాం.. ఈ మూవీ డిజాస్టర్ కావడంపై నాగవంశీ షాకింగ్ రియాక్షన్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-22 08:16:14  IST  )

ప్రతి సినిమాను ఎన్నో ఆశలతో తెరకెక్కిస్తారు. ప్రేక్షకులను ఎలాగైనా మెప్పించాలని చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ కష్టమైన సీన్స్‌ను సైతం ఇష్టంగా చేస్తారు.

వాళ్లను నమ్మి మేము  దొరికిపోయాం.. ఈ మూవీ డిజాస్టర్ కావడంపై నాగవంశీ షాకింగ్ రియాక్షన్
X

దిశ, సినిమా: ప్రతి సినిమాను ఎన్నో ఆశలతో తెరకెక్కిస్తారు. ప్రేక్షకులను ఎలాగైనా మెప్పించాలని చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ కష్టమైన సీన్స్‌ను సైతం ఇష్టంగా చేస్తారు. కొంతమంది హిట్ అవుతుందని నమ్మి భారీ బడ్జెట్‌తో సినిమాలు చేస్తుంటారు. దర్శకనిర్మాతలు కొన్ని చిత్రాలపై విపరీతమైన నమ్మకం పెట్టుకుంటారు. కానీ కొన్ని చిత్రాలకు షూటింగ్ సమయంలో వచ్చినంత హైప్ కూడా రాదు. భారీ అంచనాల మధ్య వచ్చి ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద బోల్తా పడతాయి. ఆ తర్వాత ఏం చేయలేక తప్పును ఒప్పుకుంటారు. ఇక ‘వార్-2’(War-2) సినిమా కూడా బాక్సాఫీసు వద్ద అనుకున్నంతగా మెప్పించలేకపోయింది.

ఈ మూవీని తెలుగులోకి తీసుకువచ్చిన నిర్మాత నాగవంశీ విడుదలకు ముందు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. దాదాపు వంద కోట్లు చెల్లించి మరీ కొనుగోలు చేసినప్పటికీ లాభాలు రాలేదు. పైగా నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. తాజాగా, ‘వార్-2’ డిజాస్టర్ కావడంపై నాగవంశీ (Naga Vamsi)స్పందించారు. ‘‘నేను ఆ రోజు స్టేజ్ మీద బాగా ఎగ్జైట్ అయ్యాను. తప్పులు అందరూ చేస్తారు కదా? మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉంటారా? నేను, ఎన్టీఆర్ అన్నా.. యశ్ చోప్రా, యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ల (ఆదిత్య చోప్రా)(Aditya Chopra)ను నమ్మాం.

వాళ్ల వైపు తప్పు జరిగింది. మనం దొరికాం.. మేం చేసిన సినిమా కాదు కదా.. ఇండియాలో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్‌ని నమ్మాం. తప్పు జరిగింది.. దొరికాం.. ట్రోల్ చేస్తున్నారు.. మన తెలుగు మూవీతో దొరకలేదు..అందుకే హ్యాపీ’’ అని అన్నారు. కాగా.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పాత్రలో నటించిన ‘ఈ వార్-2’ చిత్రం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చింది. దీనిని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించగా.. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్‌గా నిలిచింది.

READ MORE ...

‘లోకా’ విషయంలో వారు అలా చేయకపోతే నా పేరు మార్చుకుంటా.. నాగవంశీ సెన్సేషనల్ కామెంట్స్

Next Story