ప్రేక్షకులు ఆశ్చర్యపోయే కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం.. ‘AA-22’ పై హైప్ పెంచేసిన అట్లీ

by Mallepaka Hamsa |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది.

ప్రేక్షకులు ఆశ్చర్యపోయే కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం.. ‘AA-22’ పై హైప్ పెంచేసిన అట్లీ
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(Atlee) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ సినిమా ‘AA22xA6’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone)హీరోయిన్‌గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పదుల సంఖ్యలో హాలీవుడ్ నిపుణులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న అట్లీ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు.

‘‘ఏదైనా ఒక ఆలోచనతో ప్రారంభం అవుతుంది. ఈ మూవీ ప్రేక్షకులు ఆశ్చర్యపోయే కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుడు మా ఈ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ తోడు ఉన్నాడని ఆశిస్తున్నాం. ఆయన దయవల్ల అంతా మేం అనుకున్నట్లే జరుగుతుందని నమ్ముతున్నాం. ఇంత భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిచడం రిస్క్‌గా నేను అనుకోవడం లేదు.. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. వ్యక్తిగతంగా, ఈ ప్రాజెక్ట్ నిజంగా ప్రత్యేకమైనదిగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అత్యంత సవాలుతో కూడిన చిత్రాలలో ఒకటి. కాబట్టి దయచేసి.. మాకు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వండి. మరి కొన్ని నెలల్లో ఈ సినిమాను మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అప్డేట్స్ విడుదల చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

LINK

Next Story