- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా భర్తతో రీతూ చౌదరి ఎఫైర్.. అందుకే విడిపోతున్నామంటూ వీడియో రిలీజ్ చేసిన టాలీవుడ్ హీరో భార్య..
టాలీవుడ్ హీరో ధర్మ మహేష్(Dharma Mahesh) వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఆయన భార్య గౌతమి కేసు పెట్టిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో ధర్మ మహేష్(Dharma Mahesh) వరకట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఆయన భార్య గౌతమి కేసు పెట్టిన విషయం తెలిసిందే. తన భర్త మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నడని తనను చిత్రహింసలకు గురి చేశాడని పలు సంచలన కామెంట్స్ చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, గౌతమి చౌదరి(Gauthami Chowdhury) మరో పోస్ట్‌తో అందరికీ షాకిచ్చింది. కొన్ని స్క్రీన్ షార్ట్స్‌తో పాటు ధర్మమహేష్‌తో బిగ్‌బాస్ రీతూ చౌదరితో ఉన్న వీడియోలను రిలీజ్ చేసింది. తన భర్తతో రిలేషన్‌లో ఉందని అందుకే తాము విడిపోయామని నోట్ షేర్ చేసింది. ‘‘ధర్మ మహేష్, నేను ప్రేమించుకుని పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నాము.
ఆ తర్వాత మేము బాగానే ఉన్నాం. 2023లో నేను గర్భం దాల్చాను అదే సమయంలో కాస్త బరువు పెరిగిపోయాను. అప్పుడే రీతూ చౌదరితో ధర్మకు పరిచయం అయింది. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే మా ఫ్లాట్‌కి వచ్చేది. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు మహేష్ నా ముఖం మీద నువ్వు చాలా బరువు పెరిగిపోయావు నీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. అప్పుడు నేను తట్టుకోలేకపోయాను. రీతూ చౌదరితో అతని చాట్‌ల గురించి ప్రశ్నించాను. నిత్యం కలుస్తున్నావని అనుమానించడంతో నాపై దాడి చేశాడు.
ఇలాంటి పోస్ట్ పెట్టాలని లేదు కానీ అతని లాంటి పురుషుడు, ఆమె లాంటి స్త్రీ నా జీవితాన్ని నాశనం చేశారు. మాతృత్వ క్షణాలను దూరం చేసి మమ్మల్ని బాధపెడుతున్నారు. నేను షేర్ చేసిన వీడియో సానుభూతి కోసం కాదు. నా పోరాట వాస్తవికతను చూపించడానికి నా కోసం, నా బిడ్డ కోసం అతను ఎంత ఇబ్బంది పెట్టినా భరించాను. నా భర్త, ఆ స్త్రీ కలిసి నన్ను నరకంలోకి నెట్టారు. ఈ రోజు మేము విడిపోవడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. అంతా ఆ స్త్రీ వల్లే జరిగింది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వీరిద్దరు ఎందుకు కలిసారనేది నెట్టింట సంచలనంగా మారింది.






