మేము కూడా దెయ్యాలాంటివాళ్లమే.. కొత్త సినిమా అప్డేట్ ఇస్తూ అక్షయ్ కుమార్ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) వరుస హిట్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇటీవల ‘హౌస్‌ఫుల్-5’ చిత్రంతో ఘన విజయం సాధించారు.

మేము కూడా దెయ్యాలాంటివాళ్లమే.. కొత్త సినిమా అప్డేట్ ఇస్తూ అక్షయ్ కుమార్ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) వరుస హిట్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ఇటీవల ‘హౌస్‌ఫుల్-5’ చిత్రంతో ఘన విజయం సాధించారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. భూత్ బంగ్లా, హేరా పెరి-4 వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, అక్షయ్ మరో భారీ సినిమాను ప్రకటించాడు. హారర్ థ్రిల్లర్ ‘హైవాన్’ (Haiwan)మూవీతో రాబోతున్నాడు. నేడు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అవడంతో పాటు షూటింగ్‌ కూడా స్టార్ట్ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘మేము కూడా దెయ్యాలాంటి వాళ్ళమే. అందరిలో పాజిటివ్, నెగిటివ్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లోనే మన మనస్థత్వాలు బయపెడతాము.

నేడు కొచ్చిలో హైవాన్ షూటింగ్ ప్రారంభిస్తున్నాను. దాదాపు 18 సంవత్సరాల తర్వాత సైఫ్‌(Saif Ali Khan)తో కలిసి పని చేయడం చాలా బాగుంది. హవానియాత్ ప్రారంభిద్దాం. నేను ఇన్సాన్ అనే సినిమా చేశాను. ఆ తర్వాత, జాన్వర్ చేశా.. ఇప్పుడు నేను ‘హైవాన్’ చేస్తున్నాను. కాబట్టి త్రయం పూర్తయింది’’ అని రాసుకొచ్చారు. అయితే ‘హైవాన్’ సినిమాకు ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని కెవిఎన్ ప్రొడక్షన్స్, ది స్పైన్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై వెంకట్ నారాయణ, శైలజ దేశాయ్ నిర్మిస్తున్నారు. ఇందులో అక్షయ్ విలన్‌గా నటిస్తున్నట్లు టాక్. ఈ చిత్రం మలయాళ ‘ఒప్పం’కు రిమేక్‌గా తెరకెక్కుతోంది.

Next Story