- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రాబోతున్న ‘వార్-2’.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘వార్-2’(war-2).

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘వార్-2’(war-2). ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr) బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో ఆయన కీలక పాత్రలో కనిపించగా.. కియారా అద్వానీ (Kiara Advani)హీరోయిన్‌గా నటించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్: స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ మూవీ ‘వార్’కి సీక్వెల్‌గా వచ్చింది. ఆగస్టు 14న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా పలు విమర్శలు ఎదుర్కొంది. అయినప్పటికీ ‘వార్-2’ ఓటీటీలోకి రాకపోవడం గమనార్హం.
దీంతో హృతిక్, ఎన్టీఆర్ కాంబోను చూసేందుకు సినీ ప్రియులు ముచ్చట పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ‘వార్-2’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై పలు పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటికి చెక్ పెడుతూ ప్రముఖ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘ఆవేశాన్ని రెట్టింపు చేసుకోండి. కోపాన్ని రెట్టింపు చేసుకోండి. యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా?’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 9 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించారు. థియేటర్స్‌లో విడుదలైన 8వారాల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆనందపడుతున్నారు.






