‘అదుర్స్’ సినిమా సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన వి.వి వినాయక్

by Mallepaka Hamsa |

మనం నిజం మాట్లాడుకుంటే.. ఆ సినిమా కథ అక్కడితోనే అయిపోయింది. సీక్వెల్ తీయడానికి ఇప్పుడు అక్కడ ఏమీ మిగలలేదు. ఒకవేళ సీక్వెల్‌ను బలవంతంగా తీసినా, మళ్లీ అంత గొప్పగా చేయగలమనే నమ్మకం నాకు లేదు.

‘అదుర్స్’ సినిమా సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన వి.వి వినాయక్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హిస్టరీలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల్లో ‘అదుర్స్’ ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ చేసిన డబుల్ యాక్షన్.. ఒకవైపు మాస్ హీరోగా ‘నరసింహా’, మరోవైపు అమాయకపు బ్రాహ్మణుడిగా ‘చారి’ పాత్రలో చేసిన రచ్చ ఇప్పటికీ ప్రేక్షకులకు కళ్లముందే ఉంటుంది. అయితే, గత కొన్నేళ్లుగా ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై దర్శకుడు వి.వి. వినాయక్ పూర్తి క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్‌ను నిరాశపరిచారు. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న వి.వి. వినాయక్, ‘అదుర్స్ 2’ గురించి అడిగిన ప్రశ్నకు చాలా నిజాయితీగా సమాధానం ఇచ్చారు. “మనం నిజం మాట్లాడుకుంటే.. ఆ సినిమా కథ అక్కడితోనే అయిపోయింది. సీక్వెల్ తీయడానికి ఇప్పుడు అక్కడ ఏమీ మిగలలేదు. ఒకవేళ సీక్వెల్‌ను బలవంతంగా తీసినా, మళ్లీ అంత గొప్పగా చేయగలమనే నమ్మకం నాకు లేదు. మొదటి భాగం అందించిన ఆ అనుభూతిని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడమే అందరికీ మంచిది” అని ఆయన స్పష్టం చేశారు. అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య పండిన కామెడీ ఒక అద్భుతమని, దాన్ని మళ్లీ రీక్రియేట్ చేయడం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story