తన పెదవులు నా లిప్స్‌కు తాకగానే వాంతి వచ్చింది.. వందసార్లు నోరు కడుక్కున్నా : Raveena Tandon

by Disha Web Desk |
తన పెదవులు నా లిప్స్‌కు తాకగానే వాంతి వచ్చింది.. వందసార్లు నోరు కడుక్కున్నా : Raveena Tandon
X

దిశ, సినిమా: బీటౌన్ స్టార్ యాక్ట్రెస్‌లో ఒకరైన రవీనా టాండన్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగుతోపాటు పలు భాషల్లో నటించి హీరోయిన్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ‘ఆ రోజుల్లో కాంట్రాక్ట్ లాంటివి ఏమీ లేవు. అయినా కూడా నేను ఎప్పుడూ ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. ఆ సీన్స్‌ చేస్తే నాకు అసౌకర్యంగా ఉంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన ఓ సంఘటన ఇప్పటికి మర్చిపోలేను. ఓ సన్నివేశంలో నా సహనటుడి పెదవులు పొరపాటున నా పెదవులకు తగిలాయి. ఇది అతను కావాలని చేయలేదు అనుకోకుండా జరిగింది. వెంటనే అక్కడి నుంచి నా రూమ్‌లోకి వెళ్లాను. వికారంతో వామిట్ అయింది. నోటిని వందసార్లు కడుక్కుంటే బాగుండని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story