‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌తో ట్విస్ట్ ఇచ్చిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |

చిత్ర యూనిట్ ఇచ్చిన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలకు చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసింది.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌తో ట్విస్ట్ ఇచ్చిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Viswanath & Sons)సినిమా అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా చిత్ర యూనిట్ ఇచ్చిన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలకు చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న సూర్య, ఈ సినిమాలో ‘సంజయ్ విశ్వనాథ్’ అనే పవర్‌ఫుల్, ఎమోషనల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. "సంజయ్ విశ్వనాథ్ వచ్చేస్తున్నారు.. ప్రేమతో నిండిన హృదయంతో" అనే క్రేజీ క్యాప్షన్‌తో చిత్ర యూనిట్ టీజర్ డేట్‌ను ప్రకటించింది. మార్చి 16న సాయంత్రం 04:06 గంటలకు ఈ చిత్ర టీజర్ గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, ఇప్పుడు టీజర్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

టీజర్ అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా మేకర్స్ హీరో, హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తున్న ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. అయితే, ఇందులో ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇద్దరి ముఖాలు కనిపించకుండా నడుస్తున్న వారి కాళ్ల ఫోటోను రిలీజ్ చేయడంతో నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. కానీ, ఈ పోస్టర్‌లో ఉన్నది మమితనా లేక సర్ప్రైజింగ్‌గా మరెవరైనా హీరోయిన్ ఉన్నారా? అనే సస్పెన్స్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, షార్చ్యూర్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

Next Story