- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిలీజ్‌కు సిద్ధమైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు సూర్య మాస్టర్ ప్లాన్!
తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ చిత్రాన్ని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ వెంకీ అట్లూరీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఈ సినిమా ఒక స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని స్పష్టం చేయడంతో, థియేటర్లలో ఈ మూవీ ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా అప్‌డేట్ ప్రకారం.. ఈ చిత్రాన్ని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే, వసూళ్ల పరంగా బాక్సాఫీస్ వద్ద పక్కా ప్లానింగ్‌తో ఉన్న చిత్ర యూనిట్, ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు 14న సినిమాను విడుదల చేయాలని యోచిస్తోందట.
ఇలా చేయడం వల్ల స్వాతంత్ర దినోత్సవ సెలవుతో పాటు శని, ఆదివారాలు కూడా కలిసి వస్తాయని ఈ మాస్టర్ ప్టాన్ వేసినట్లు టాక్. ఈ లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్‌తో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టవచ్చని నిర్మాత దిల్ రాజు బృందం స్కెచ్ వేసినట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రంలో సూర్య సరసన ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈమూవీని నిర్మిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. వెంకీ అట్లూరీ మార్క్ ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్‌కు సూర్య పవర్‌ఫుల్ యాక్టింగ్ తోడైతే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలు పుష్కలంగా ఉండటంతో ఆగస్టు నెలలో ఈ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సందడి మామూలుగా ఉండదనిపిస్తోంది.






