ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన ‘విశ్వంభర’.. క్రేజీ అప్డేట్‌తో ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్!

by Mallepaka Hamsa |

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన ‘విశ్వంభర’.. క్రేజీ అప్డేట్‌తో ఫుల్ ఖుషీలో మెగా ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటినుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ట అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన స్టార్ బ్యూటీ త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎలాంటి రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే, ఈ మూవీ షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల, గ్రాఫిక్స్ పనుల ఆలస్యం వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కొత్త వీఎఫ్ఎక్స్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చేలా, కథను ఇంకొంత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్ ఒక కొత్త ఎపిసోడ్‌ను సినిమాలో జోడించాలని నిర్ణయించుకున్నారట. దీనికోసం దాదాపు వారం రోజుల పాటు ప్రత్యేకంగా షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త సీన్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భారీ ఫాంటసీ చిత్రాన్ని అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దసరా పండుగ సీజన్‌లో మెగాస్టార్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story