సమ్మర్ స్పెషల్‌గా ‘విశ్వంభర’ సినిమా.. కీలక ప్రకటన విడుదల చేస్తూ మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’(Vishvambhara).

సమ్మర్ స్పెషల్‌గా ‘విశ్వంభర’ సినిమా.. కీలక ప్రకటన విడుదల చేస్తూ మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’(Vishvambhara). వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సోసియో ఫాంటసీ చిత్రంగా రాబోతుండగా.. దీనిని యూవి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ఇందులో మెగాస్టార్ సరసన త్రిష (trisha), అషికా రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ పలు వాయిదాలు పడుతూ వస్తుంది. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో.. తాజాగా, చిరు పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. ‘‘ఇలా మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర. చాలా మందికి పలు డౌట్స్ ఉన్నాయి. ఈ చిత్రం ఎందుకు లేట్ అవుతుందని. ఇదంతా సెకండ్ ఆఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. మీకు అత్యున్నతమైన ప్రమాణాలతోటి ది బెస్ట్ క్వాలిటీతో మీ ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతల నిర్ణయమే ఈ ఆలస్యానికి కారణం. ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా శ్రద్ధాసిద్దులతో తీసుకున్నసముచితమైన సమయం ఇది. ఇదొక చందమామ కథలా సాగిపోయే కథ.

చిన్నపిల్లలకు, పెద్ద వాళ్లలో చిన్నపిల్లలు ఉండే వారిని ఎంతగానో అలరిస్తోంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మీతో పాటు నాకూడా సమాధానంగా మూవీ మేకర్స్ ఓ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు. అది కూడా నా పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగా ఈరోజు సాయంత్రం 6: 06 గంటలకు రాబోతుంది. మీ అందరి కోసం ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లీక్ చేస్తున్నాను. చిన్నారులు.. పెద్దల్లోనూ చిన్న పిల్లలు ఉండే వారు ఎంజాయ్ చేసే సీజన్ సమ్మర్ స్పెషల్‌గా మా సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని చూడండి.. విశ్వంభరను ఆస్వాదించండి’’ అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

link

Next Story