'విశ్వంభర' రిలీజ్ డేట్ ఫిక్స్..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-09 15:45:45  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 155 పైగా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. అలాగే ఈ ఏజ్‌లోనూ యంగ్ హీరోస్‌కి గట్టి పోటీ ఇస్తున్నాడు.

విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 155 పైగా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. అలాగే ఈ ఏజ్‌లోనూ యంగ్ హీరోస్‌కి గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే చివరిగా నటించిన ‘భోళా శంకర్’(Bhola Shankar), ‘వాల్తేరు వీరయ్య’(Valtheru Veeraiah) సినిమాలు అనుకున్న విజయాలు సాధించలేదు. దీంతో మరో బ్లాక్ బస్టర్ కల్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు మన చిరంజీవి. ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’(Viswambhara).

ఎంతో ప్రతిష్టాత్మకంగా విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వశిష్ట(Vasista) దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో అలనాటి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha), యంగ్ బ్యూటీ అషిక రంగనాథ్(Ashika Ranganath) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూటింగ్ ఏడాది అవుతున్నప్పటికీ పోస్టర్స్ మాత్రమే విడుదల చేసి క్యూరియాసిటీ పెంచారు. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్‌తో పాటు, సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సాధారణంగా ఈ సినిమా ఈ ఏడాది 2025 సంక్రాంతి కానుకగానే రావాల్సి ఉండగా ఎందుకో వాయిదా పడింది. అయితే... ఎట్టకేలకు మళ్లీ రిలీజ్ డేట్ విషయంపై 'విశ్వంభర' టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు రిలీజ్ డేట్స్‌ను పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అందులో ఒకటి మే 9, 2025. సమ్మర్ హాలీడేస్‌లో బాస్ ఎంట్రీ ఇచ్చి దుమ్ములేపబోతున్నాడని తెలుస్తోంది.

అప్పడైతే రీచ్‌తో పాటు బాక్సాఫీస్ కలెక్షన్లు కూడా అదిరిపోతాయని టీమ్ అంచనా వేస్తుందని తెలుస్తోంది. మరోవైపు ఆగస్టు 22 అని కూడా ప్రచారంలో ఉంది. ఈ డేట్ చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు. ఎందుకంటే ఆ రోజు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కావడం విశేషం. ఆ స్పెషల్ డేన 'విశ్వంభర'ను రిలీజ్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

READ MORE ...

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్ సి-16 షూటింగ్ హైదరాబాద్‌లో అక్కడ జరగబోతుందోచ్(పోస్ట్)


Next Story