క్యూరియాసిటీ పెంచుతున్న ‘విష్ణు విన్యాసం’ టీజర్

by Mallepaka Hamsa |

ష్ణు పాత్రకు జాతకాలంటే పిచ్చి, అతని తండ్రి మాత్రం డబ్బునే దేవుడిలా భావిస్తాడు. చిన్న నిర్ణయం తీసుకునే ముందు కూడా వాస్తు చూసే అతని అలవాటు కథలో హాస్యాన్ని తీసుకొస్తుంది.

క్యూరియాసిటీ పెంచుతున్న ‘విష్ణు విన్యాసం’ టీజర్
X

దిశ, సినిమా: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు(Sree Vishnu) హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ 'విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam)తో థియేటర్లలో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు (Yadunath Maruti Rao) తెరకెక్కించిన ఈ చిత్రంలో నయన సారిక హీరోయిన్‌గా నటించింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ఇప్పుడు హైలీ ఎంటర్‌టైనింగ్ టీజర్ లాంచ్ చేశారు. విష్ణు పాత్రకు జాతకాలంటే పిచ్చి, అతని తండ్రి మాత్రం డబ్బునే దేవుడిలా భావిస్తాడు. చిన్న నిర్ణయం తీసుకునే ముందు కూడా వాస్తు చూసే అతని అలవాటు కథలో హాస్యాన్ని తీసుకొస్తుంది. ఈ గందరగోళ మధ్యలో అతను ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయి అతనికంటే అనూహ్యంగా ప్రవర్తిస్తుంది. ఒక క్షణం ప్రేమగా ఉంటే, మరో క్షణం తనకో అబ్బాయిని వెతకమని అడుగుతుంది. ఈ డైనమిక్‌తో ఒక కొత్త తరహా, క్విర్కీ లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది.

“Use Headphones” అనే వార్నింగ్‌తో, ఒక సరదా ఎమోజీతో మొదలవుతూ వినోదభరితమైన ప్రయాణానికి ఆహ్వానిస్తుంది. ప్రపోజల్, కిస్ సీన్లు యూత్‌ఫుల్ హ్యూమర్‌తో ఆకట్టుకుంటాయి. కథనాన్ని వినూత్నంగా, అత్యంత ఫన్నీగా ప్రెజెంటర్ చేశారు దర్శకుడు యదునాథ్ మారుతి రావు. కామెడీలో తన ప్రత్యేకతను మరోసారి నిరూపించారు శ్రీ విష్ణు. ఆయన టైమింగ్, రియాక్షన్స్ ప్రేక్షకులకు నవ్వులు పంచాయి. నయన సారిక పాత్రలోని ఆఫ్‌బీట్ ఛార్మ్ కామెడీని మరింత పెంచుతుంది. వారి కెమిస్ట్రీ సరదా అల్లరి, యూనిక్ డైలాగ్స్ తో మెప్పిస్తుంది. సాయి శ్రీరామ్ అందించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి, సంగీత దర్శకుడు రధన్ తన ఎనర్జిటిక్ స్కోర్‌తో సినిమా ఫన్ టోన్‌ను మరింత ఎలివేట్ చేశారు. ‘విష్ణు విన్యాసం’ ఒక ఫ్రెష్ ఎంటర్‌టైనర్‌గా అలరించనుంది. విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచడమే కాకుండా.. ఇప్పటికే సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.



Next Story