మనోజ్ షేర్ చేసిన వీడియోపై స్పందించిన విష్ణు

by Sathputhe Rajesh |   (  Updated:2023-03-24 08:47:41  IST  )

మంచు ఫ్యామిలీలో వివాదాలు బయటపడిన విషయం తెలిసిందే.

మనోజ్ షేర్ చేసిన వీడియోపై స్పందించిన విష్ణు
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలీలో వివాదాలు బయటపడిన విషయం తెలిసిందే. విష్ణు, మనోజ్ కు పొసగడం లేదని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మనోజ్ అనుచరులతో విష్ణు గొడవపడిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మనోజ్ షేర్ చేసిన వీడియోపై మంచు విష్ణు స్పందించారు. ‘ఇది నిన్న జరిగిన చిన్న గొడవ. మా ఇద్దరి మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణమే. సారధితో వాగ్వాదాన్ని ఆపలేదు. కానీ వీడియో తీసి పోస్ట్ చేశాడు. మనోజ్ చిన్నవాడు. ఇది స్పందించాల్సిన పెద్ద విషయం కాదు. దీన్ని భూతద్దంలో చూడొద్దు. మావాడు ఏదో ఆవేశంలో పోస్ట్ చేశాడు.’ అని వివరణ ఇచ్చాడు.

Read more:

Manchu Vishnu: రోడ్డునపడ్డ మంచు వారి విభేదాలు.. వీడియో వైరల్

బ్రేకింగ్ : రచ్చకెక్కిన మంచు విష్ణు, మనోజ్ వివాదం (వీడియో)

Next Story