Manchu Vishnu: రోడ్డునపడ్డ మంచు వారి విభేదాలు.. వీడియో వైరల్

by Disha Web Desk 10 |
Manchu Vishnu: రోడ్డునపడ్డ మంచు వారి విభేదాలు.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇటీవల మొహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ ఫ్యామిలీకి సంబంధించిన పలు గొడవల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన అన్న మంచు విష్ణు దురుసు ప్రవర్తనకు సంబంధించిన ఓ వీడియోను మనోజ్ నెట్టింట పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇందులో మనోజ్ అనుచరుడు సారథి ఇంటికెళ్లిన విష్ణు.. ఇద్దరు వ్యక్తులు ఆపుతుండగా ‘ఒరేయ్ అరేయ్ అని ఏదో అంటున్నాడు కదా?’ అంటూ కోపంతో రగిలిపోతూ దాడిచేయడాని ప్రయత్నించాడు. అందులోనే ‘ఇదిగోండి ఇలా ఇంటి మీదకు వచ్చి అందరినీ కొడుతుంటాడు’ అని మనోజ్ వాయిస్ వినిపిస్తోంది. ఈ వీడియోను ఫేజ్ బుక్ పేజీలో స్టేటస్ పెట్టిన మనోజ్.. ‘ఇలాగే బంధువుల ఇంటికి వచ్చి దాడులు చేస్తాడు. అందరిముందే కొడుతున్నాడు’ అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. తాజా సమాచారం ప్రకారం ఈ గొడవకు సంబంధించి కంప్లైంట్ ఇవ్వడానికి తన సన్నిహితులతో కలిసి మనోజు పోలీస్ స్టేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది.


Next Story