- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాల్ ‘మకుటం’ ఫస్ట్ లుక్ రిలీజ్.. షాకింగ్ పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన మూవీ మేకర్స్
వెర్సటైల్ హీరో విశాల్(Vishal) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మకుటం’(makutam). తమిళంలో ఈ సినిమా ‘మకుడం’ పేరుతో రాబోతుంది.

దిశ, సినిమా: వెర్సటైల్ హీరో విశాల్(Vishal) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మకుటం’(makutam). తమిళంలో ఈ సినిమా ‘మకుడం’ పేరుతో రాబోతుంది. ఆయన కెరీర్‌లో 35వ చిత్రంగా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు రవి అరసు (Ravi Arasu)దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ప్రతిష్టాత్మక బ్యానర్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో విశాల్ సరసన దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అంజలి కీలక పాత్రలో కనిపించబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇటీవల టైటిల్ టీజర్ విడుదల చేయగా.. అంచనాలను పెంచేసింది.
తాజాగా, ‘మకుటం’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ విశాల్.. ఫైనల్లీ నా తదుపరి చిత్రం మగుడం తమిళంలో మకుటం తెలుగులో ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి పూర్తి సానుకూలతతో సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉన్నాను. మీ అందరికీ ఇది నచ్చుతుందని ఆశిస్తున్నాను. 2వ షెడ్యూల్ పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగి వచ్చాను. మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఎదురుచూస్తున్నాయి. లవ్ మేము అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ చేసాము. శుభప్రదమైన రోజున దీన్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.
నా ప్రియమైన వారందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సుతో నిండిన ఈ రోజును ఆస్వాదించండి. దేవుడు దీవించుగాక’’ అని రాసుకొచ్చాడు. ఇక విడుదల చేసిన పోస్టర్‌లో విశాల్ మూడు విభిన్న గెటప్పులో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఒక లుక్‌లో వెరైటీ కటింగ్‌తో కనిపించగా... మరో పోస్టర్‌లో వైట్ కలర్ సూటు బూటు ధరించి ముసలివాడిలా కనిపించాడు. ఇక ఆ తర్వాత ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలా డీసెంట్ లుక్‌తో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూడు లుక్స్ అందరిలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. అయితే ఈ సినిమాలో విశాల్ డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ లుక్, మిడిల్ ఏజ్, అలాగే ఓల్డేజ్ లుక్‌లో విశాల్ అందరికీ షాకిచ్చేలా ఉన్నాడు.






