Virata Parvam: మావోయిస్టు భారతక్కపై హీరో ప్రశంసలు.. శాంతిదూత అంటూ

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-08-29 09:41:18  IST  )

Virata parvam team releases priyamani poster on her birthday| ప్రేమ నేపథ్యంలో రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన

Virata Parvam
X

దిశ, సినిమా: Virata parvam team releases priyamani poster on her birthday| ప్రేమ నేపథ్యంలో రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కామ్రేడ్‌ భారతక్క పాత్రలో నటించింది సీనియర్ నటి ప్రియమణి. అయితే నేడు ఆమె పుట్టినరోజు కాగా.. న్యూ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ విషెస్ తెలిపింది మూవీ యూనిట్. ప్రజా పోరాటంలో భాగంగా యుద్ధానికి సిద్ధమైనట్లు కనిపిస్తున్న ప్రియమణి పోస్టర్‌ను నెట్టింట్లో షేర్ చేసిన రానా.. 'మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్‌లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాటపర్వంలో కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకం' అంటూ తనదైన స్టైల్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మి్స్తున్న ఈ హిస్టారికల్ మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. రవి శంకర్ అలియాస్ రవన్న పాత్రలో రానా, వెన్నెలగా సాయిపల్లవి కనిపించనున్నారు.

Next Story