ఆ లేడీతో పబ్ లో రొమాన్స్... బేబీ మూవీ నటుడి లీలలు?

by velandi.Saikiran |   (  Updated:2025-09-24 04:28:12  IST  )

మరాఠీ సోషల్ మీడియా స్టార్ యశ శ్రీ అనే యువ‌తితో ప‌బ్ లో క‌నిపించాడు విరాజ్‌. ఈ జంట హైద‌రాబాద్ లోని ఓ ప్ర‌ముఖ ప‌బ్ కు

ఆ లేడీతో పబ్ లో రొమాన్స్... బేబీ మూవీ నటుడి లీలలు?
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో విరాజ్ అశ్విన్ (Viraj Ashwin ) గురించి తెలియని వారు ఉండరు. 2018లో ఇండస్ట్రీలోకి వచ్చిన విరాజ్ అశ్విన్... అనగనగా ఓ ప్రేమకథ సినిమాతో మెరిశాడు. ఆ తర్వాత 2023 లో వచ్చిన బేబీ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి అతని ఎవరు మర్చిపోవడం లేదు. మోసపోయిన ప్రేమికుడిలా... తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే అలాంటి బేబీ నటుడు విరాజ్ అశ్విన్.... తాజాగా ఓ అమ్మాయితో మెరిశాడు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరాఠీ సోషల్ మీడియా స్టార్ యశ శ్రీ అనే యువ‌తితో ప‌బ్ లో క‌నిపించాడు విరాజ్‌. ఈ జంట హైద‌రాబాద్ లోని ఓ ప్ర‌ముఖ ప‌బ్ కు వ‌చ్చారు. నిన్న రాత్రంతా ఫుల్ ఎంజాయ్ చేసిన‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది.త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌నున్నార‌ట‌. అందుకే ఇప్పటికే చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నార‌ని స‌మాచారం అందుతోంది. ఇక ఈ ప‌బ్ లో యశ శ్రీపై చేతులు వేస్తూ చాలా క్లోజ్ గా క‌నిపించాడు విరాజ్‌. దీంతో... ఈ ఇద్ద‌రూ రిలేష‌న్ లో ఉన్న‌ట్లు వీడియో చూసిన నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై విరాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Next Story