Mahesh Babu - Trivikram: మహేష్ - త్రివిక్రమ్‌ మూవీకి విలన్ కష్టాలు!

by Satheesh |   (  Updated:2022-05-30 11:25:13  IST  )

అతడు, ఖలేజా తర్వాత మహేష్-త్రివిక్రమ్(Maheh Babu - Trivikram) కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం #SSMB 28. ఇందులో పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయికగా నటిస్తోంది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది.

Mahesh Babu - Trivikram
X

దిశ, సినిమా: అతడు, ఖలేజా తర్వాత మహేష్-త్రివిక్రమ్(Maheh Babu - Trivikram) కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం #SSMB 28. ఇందులో పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయికగా నటిస్తోంది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో విలన్ పాత్రకు తగిన నటుడి కోసం మేకర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పాత్ర కోసం త్రివిక్రమ్ ఓ స్టార్ హీరోను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మొన్నటి వరకు విలన్ పాత్రలో తారకరత్న నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తారకరత్న ఇప్పటి వరకు చేసిన ప్రయోగాత్మక సినిమాల్లో ఒక్కటి కూడా సరైన హిట్ అందుకోలేదు.

అయితే ఆ ఎఫెక్ట్ మహేష్ మూవీపై పడుతుందనే ఆలోచనతో ఉన్నారట మేకర్స్. అందుకే విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. సేతుపతి తెలుగులో సైరా నరసింహా రెడ్డిలో సపోర్టింగ్ క్యారెక్టర్‌తో, ఉప్పెనలో విలన్‌గా కనిపించి మెప్పించాడు. రీసెంట్ బ్లాక్ బస్టర్ పుష్పతో ఫహాద్ కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. వీరిద్దరికీ తెలుగులో మంచి పాపులారిటీ ఉంది కాబట్టి వారిలో ఒకరిని విలన్‌గా ఎంచుకుంటే మూవీకి ప్లస్ అవుతుందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటి వరకు తెలుగులో ఒక్క మూవీ కూడా చేయలేదు. సాధారణంగా నెగిటివ్ పాత్రలకు దూరంగా ఉంటారు. మరి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంటారో లేదో చూడాలి..

Next Story