తమన్నాను వదిలేసి ఆ హీరోయిన్‌ను తగులుకున్న విజయ్ వర్మ.. ప్రైవేట్ వీడియో లీక్ కావడంతో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

తమన్నాను వదిలేసి ఆ హీరోయిన్‌ను తగులుకున్న విజయ్ వర్మ.. ప్రైవేట్ వీడియో లీక్ కావడంతో దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. స్టార్ హీరోల సరసన నటించిన మిల్కీ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించడంతో పాటు ఐటమ్ సాంగ్స్‌లోనూ చిందులేసింది. అలాగే వెబ్‌సిరీస్‌లతోనూ ప్రేక్షకులను అలరించింది. ‘లస్ట్ స్టోరీస్-2’(Lust Stories-2)తో గ్లామర్ గేట్లు ఎత్తేసిన తమన్నా మరీ బోల్డ్‌గా నటించి అందరినీ షాక్‌కు గురి చేసింది.

వరుస ఆఫర్లతో కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో నటుడు విజయ్ వర్మ(Vijay Verma)తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. వీరిద్దరు కలిసి గత కొద్ది కాలంగా వెకేషన్స్, ఈవెంట్స్, ఫంక్షన్స్ అంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే క్రమంలోనే.. మనస్పర్థల కారణంగా బ్రేకప్ చెప్పుకుని విడిపోయారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ వార్తలపై ఈ లవ్ బర్డ్స్ స్పందించకపోవడంతో అంతా అయోమయంలో పడిపోయారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, తమన్నా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ ఆమెను వదిలేసి ఫాతిమా సన షేక్‌(Fatima Sana Sheikh)ను లైన్‌లో పెట్టాడు. వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇందులో ‘దంగల్’ నటి ఫాతిమా అతడిని గట్టిగా హగ్ చేసుకోవడంతో పాటు చెంపపై ముద్దు కూడా పెట్టింది. వీరిద్దరు కలిసి లంచ్‌కు వెళ్లగా.. బయటకు వస్తూ అందరిముందే రెచ్చిపోయింది. కెమెరామెన్స్ ఫొటోలు తీస్తున్నప్పటికీ అమ్మడు ఏ మాత్రం భయపడకుండా అతడితో క్లోజ్‌గా మూవ్ అయింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆమెపై విజయ్ వర్మ పై దుమ్మెత్తిపోస్తున్నారు.

instagram link

Next Story