- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమన్నాతో డేటింగ్‌పై మౌనం వీడిన విజయ్.. ఏం చెప్పాడంటే..
తమన్నా భాటియాతో రిలేషన్ షిప్ పుకార్లపై విజయ్ వర్మ మౌనం వీడాడు.

దిశ, సినిమా : తమన్నా భాటియాతో రిలేషన్ షిప్ పుకార్లపై విజయ్ వర్మ మౌనం వీడాడు. ఇటీవల ఓ హోటల్లో డిన్నర్‌కు వెళ్లిన జోడీ కెమెరాల కంటపడటంతో మరోసారి రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ సమావేశంలో దీనిపై మాట్లాడిన విజయ్ వర్మ.. ‘ఈ అనుభవం నాకు చాలా కొత్తది. ప్రత్యేకమైనది. నేనెప్పుడూ ఇలాంటివి ఎదుర్కోలేదు. నా వ్యక్తిగత జీవితంకంటే పనిమీదనే ఎక్కువ దృష్టి పెడతా. అందుకే ఈ స్థాయికి చేరుకున్నా. తమన్నతో ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడాలని ఎప్పుడూ అనిపించలేదు. ప్రపంచం మాత్రం దాని గురించే మాట్లాడుతుంది. నేను ఇలాంటి పుకార్లను ఎదుర్కోవటానికి ఒక మార్గాన్ని కనుగొన్నాను. దానిని కొట్టిపారేయడం కంటే.. దానిపై మాట్లాడకపోవడమే మంచిదని. నా లైఫ్ ఎవరికీ జవాబుదారీగా ఉండదు’ అంటూ రూమర్స్‌కు చెక్ పెట్టాడు.
Also Read; ఆ విషయంలోనే గొడవలు.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్






