ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విజయ్.. ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయంటూ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)గత కొద్ది కాలం క్రితం ‘ది’ ట్యాగ్‌ను తన పేరులో జోడించుకున్న విషయం తెలిసిందే.

ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న విజయ్.. ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయంటూ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)గత కొద్ది కాలం క్రితం ‘ది’ ట్యాగ్‌ను తన పేరులో జోడించుకున్న విషయం తెలిసిందే. ఇది కాస్త సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘‘నా పేరుకు ముందు ది ట్యాగ్‌ను జోడించడం వల్ల విపరీతమైన విమర్శలు వచ్చాయి. దీనివల్ల ఇతరు హీరోలెవరూ ఎదుర్కోనన్ని ఎదురు దెబ్బలు నాకు తగిలాయి. యూనివర్సల్ స్టార్ నుంచి పీపుల్స్ స్టార్ వరకు ఎన్నో ట్యాగ్స్ ఉన్నాయి.

నాకంటే చిన్నవారు, పెద్దవారు వీటిని ఉపయోగించుకుంటున్నారు. నాకంటే ముందు ఇండస్ట్రీకి వచ్చిన వారికి కూడా ట్యాగ్‌లైన్స్ ఉన్నాయి. బహుశా ఏ ట్యాగ్ లేకుండా ఇండస్ట్రీలో ఉన్న హీరోను నేను ఒక్కడినే కావచ్చు. అయినప్పటికీ నాకు ట్యాగ్‌లైన్‌తో నేను ప్రేక్షకులకు గుర్తుండాలనే ఆసక్తి లేదు. నన్ను నా నటనతో గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నా. ఆడియన్స్ నన్ను సదరన్ సెన్సేషన్, రౌడీ స్టార్ అని పిలిచారు. వాటిని నేను అంగీకరించకపోవడంతో నా ‘లైగర్’ టీమ్ ప్రమోషన్స్ కోసం ది అనే పదాన్ని జోడించింది. అప్పటివరకు ఆ ట్యాగ్ ఎవరికీ లేకపోవడంతో నేను అంగీకరించాను. అయితే దాని వల్ల నేను చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఏం చేయలేని పరిస్థితుల్లో దాన్ని తీసేయాలని నా టీమ్‌కు చెప్పాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మంచి పని చేశావని అంటున్నారు. కాగా, విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. రౌడీ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom).గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ టబు ప్రధాన పాత్రలో అలరించనుంది. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా గ్రాండ్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొనగా.. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లోకి వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ.. ఎప్పటికప్పుడు ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. జులై 31 ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.

link

Next Story