'గాంధీ టాక్స్' మాటల్లేవ్.. ఓన్లీ సైగలే

by Disha Web Desk 21 |
గాంధీ టాక్స్ మాటల్లేవ్.. ఓన్లీ సైగలే
X

దిశ,సినిమా: త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి 'గాంధీ టాక్స్' అనే మూకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అనౌన్స్‌మెంట్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. డ‌బ్బు కేంద్రంగా నడిచే కథతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుండగా రూ. 2000 నోట్లను ఆర‌బెడుతూ కనిపించిన విజ‌య్ ఎంట్రీ అభిమానుల్లో ఆస‌క్తిని పెంచుతోంది. కిషోర్ పండురంగ్ భ‌లేక‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న చిత్రాన్ని వచ్చే యేడాది పాన్ ఇండియ‌న్ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అర‌వింద్ స్వామి, అదితీరావ్ హైద‌రీ కీల‌క పాత్రల్లో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి : ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ వచ్చేసింది



Next Story

Most Viewed