‘తలైవాన్.. తలైవి’ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన విజయ్ సేతుపతి.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) గత ఏడాది ‘మహారాజా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఇక ఇటీవల ‘ACE’ మూవీతో ప్రేక్షకులను అలరించారు.

‘తలైవాన్.. తలైవి’ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన విజయ్  సేతుపతి.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) గత ఏడాది ‘మహారాజా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఇక ఇటీవల ‘ACE’ మూవీతో ప్రేక్షకులను అలరించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం రాబట్టుకోలేకపోయింది. అయినప్పటికీ హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా విజయ్ సేతుపతిలో తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంతో పాటు విజయ్ సేతుపతి, పాండిరాజ్(Pandiraj) దర్శకత్వంలో ‘తలైవాన్.. తలైవి’(Thalaivan.. Thalaivi) మూవీ చేస్తున్నారు. ఇక ఇందులో నిత్యామీనన్(Nithya Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. రగ్గడ్ వల్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి, త్యాగరాజన్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, గ్లింప్స్ అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ మూవీ తెలుగులో ‘సార్, మేడమ్’ పేరుతో రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘తలైవాన్.. తలైవి’ చిత్రం జులై 25న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటినీ పెంచుతున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి అప్డేట్‌ను ఇస్తూ మూవీ మేకర్స్ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘తలైవాన్.. తలైవి’ ట్రైలర్ జులై 17న రాబోతున్నట్లు తెలుపుతూ ‘‘యాక్షన్ తో కూడిన లోతైన ప్రేమ. ఈ కఠినమైన ప్రేమకథ ఈ జులై 25న మన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక పోస్టర్‌ను గమనించినట్లైతే.. ఇందులో విజయ్ సేతుపతి ఓ చేతిలో పెద్ద కత్తి.. మరో చేతిలో కుమారస్వామి పట్టుకునే శక్తి ఆయూదాన్ని పట్టుకుని నుదుటిన నామాలతో కనిపించాడు. వెనకాల ఆలయం ఉండగా.. గుడి.. త్రిశూలం మధ్యలో విజయ్ సేతుపతి ఉగ్రరూపంలో ఉన్నాడు. ప్రస్తుతంఈ పోస్టర్ సినీ ప్రియుల్లో అంచనాలను రెట్టింపు చేస్తోంది.

link

Next Story