- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay Sethupathi: కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై స్పందించిన విజయ్.. ఏడేళ్ల నుంచి చూస్తున్నానంటూ షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi)పై ఇటీవల రమ్యా మోహన్ అనే యువతి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi)పై ఇటీవల రమ్యా మోహన్ అనే యువతి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి షూటింగ్‌లో ఓ అమ్మాయిని వేధిస్తున్నట్లు పెట్టిన పోస్టులు ఇండస్ట్రీలో దుమారం రేపాయి. అంతేకాకుండా క్యారవాన్ ఫేవర్ కోసం రూ. 2లక్షలు, డ్రైవ్స్ కోసం రూ. 50 వేలను విజయ్ ఆఫర్ చేశాడని చాలా ఏళ్లుగా వేధిస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్టులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. స్టార్ హీరో అయిండి అలా చేయడమేంటని పలువురు విమర్శలు కూడా చేస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి ఈ విషయంపై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘‘సినీ ఇండస్ట్రీలోనే కాదు దూరం నుంచి నన్ను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నవారంతా ఈ యువతి ఆరోపణలు చూసిన తర్వాత నవ్వుకున్నారు. ఎందుకంటే.. నేనేంటో నాకు తెలుసు. ఈ రకమైన తప్పుడు ఆరోపణలు నన్ను ఎప్పటికీ బాధించలేవు. కానీ నా కుటుంబం, సన్నిహితులు ఎంతో కలత చెందారు. వీటిని పట్టించుకోకండి.. ఆమె ఫేమస్ కావడానికి కావాలని ఇలా చేస్తోంది. కొన్ని నిమిషాలపాటు హైలైట్ అవుతుంది. పాపం ఎంజాయ్ చేయనీయండి అని వారితో చెప్పాను. మేము సైబర్ క్రైమ్‌లో ఆమెపై ఫిర్యాదు చేశాం. ఏడు సంవత్సరాలుగా నేను ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పటివరకై దేనికీ భయపడలేదు. ఇలాంటివి ఎప్పటికీ నన్ను బాధించవు. అలాంటి వారు ఎంతమంది వచ్చినా నన్ను ఏం చేయలేరు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆ యువతిపై మండిపడుతున్నారు.






