అనసూయతో వివాదం.. ‘ఖుషి’ వేదికగా స్పందించిన విజయ్

by sudharani |
అనసూయతో వివాదం.. ‘ఖుషి’ వేదికగా స్పందించిన విజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య వివాదం నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ హీరోగా వచ్చిన ‘లైగర్’ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో.. అనసూయ దీనిపై పరోక్షంగా ట్వీట్ పెట్టి రచ్చ చేసింది. దీంతో రెచ్చిపోయిన విజయ్ అభిమానులు.. అనసూయపై నెట్టింట ట్రోల్స్ చేస్తూ.. ఆడుకోవడం మొదలు పెట్టారు. ఇక అనసూయ Vs విజయ్ ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది. అయితే వీరి ఇద్దరి మధ్య గొడవకు కారణం ఏంటి అనేది మాత్రం క్లారిటీ రాలేదు. ఇక తాజాగా దీనిపై స్పందించాడు విజయ్.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తున్న సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ను.. ఈరోజు రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో విజయ్ దేశరకొండను ఓ మీడియా ప్రతినిధి అనసూయతో అసలు వివాదం ఏంటి..? దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది..? అంటూ ప్రశ్నించారు. దీనిపై విజయ్ సమాధానమిస్తూ.. ‘ఏమో మీరు గొడవ పడే వాళ్లనే అడగాలి. సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో నాకు తెలియదు’’ అంటూ సింపుల్‌గా చెప్పుకొచ్చాడు విజయ్.

Next Story

Most Viewed