పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక.. ఆశీర్వదించిన మహేష్, నమ్రత.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన ఫొటోస్

by I. Sairam |

టాలీవుడ్‌ క్రేజీ జంట అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేర్లు విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) – రష్మిక మందన్న(Rashmika Mandanna).

పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక.. ఆశీర్వదించిన మహేష్, నమ్రత.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన ఫొటోస్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌ క్రేజీ జంట అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే పేర్లు విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) – రష్మిక మందన్న(Rashmika Mandanna). ‘గీత గోవిందం;(Geetha Govindam), ‘డియర్ కామ్రెడ్’(Dear Comrade) వంటి సినిమాల్లో నటించిన ఈ జంట అప్పటి నుంచే ప్రేమలో ఉన్నారన్న వార్తలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ ఇద్దరూ ఈ వార్తలపై అధికారికంగా ఎప్పుడూ స్పందించలేదు. అయితే వారి సోషల్ మీడియా పోస్టులు, వెకేషన్ పిక్స్‌ ద్వారా పలుమార్లు హింట్స్ ఇచ్చారు.

ఇటీవల ఈ జంట సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారని టాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ కలిసి పబ్లిక్‌గా కనిపించకపోవడంతో అభిమానులు ఎప్ప‌డు క‌లిసి క‌నిపిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలా టాలీవుడ్‌లో అత్యంత పాపులర్‌ కపుల్‌గా పేరొందిన ఈ జంట త్వరలో మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

వైరల్ అవుతున్న పిక్స్‌లో విజయ్-రష్మిక మ్యారేజ్ చేసుకున్నట్లు కనిపించింది. ఇక ఈ జంటను ఆశీర్వదించడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రతతో వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఇవి ఏఐ జనరేటర్ ఫొటోస్ అన్నట్లుగా క్లారిటీగా తెలిసిపోతుంది. ప్రస్తుతం విజయ్-రష్మిక ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అంతా ఏఐ మహిమ.. లేనివి కూడా ఉన్నట్లుగా చూపిస్తున్నారని, ఇది ఫేక్ ఫొటో బట్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story