పెళ్లి పనుల్లో బిజీ బిజీగా విజయ్-రష్మిక.. ఎట్టకేలకు వీడియో‌తో కన్ఫర్మ్ చేసేశారుగా!

by Mallepaka Hamsa |

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న ఒకే కారులో ప్రయాణించడం కెమెరా కళ్లకు చిక్కింది.

పెళ్లి పనుల్లో  బిజీ బిజీగా విజయ్-రష్మిక.. ఎట్టకేలకు వీడియో‌తో కన్ఫర్మ్ చేసేశారుగా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారన్న వార్తలకు ఇప్పుడు ఒక క్లారిటీ వస్తోంది. వీరిద్దరూ గత ఏడాది అక్టోబర్ 3న రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే ప్రచారం ఉండగా, ఇప్పుడు నేరుగా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆదివారం రాత్రి విజయ్, రష్మిక ఇద్దరూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఎయిర్‌పోర్ట్ లోపల విడివిడిగా ఉన్నప్పటికీ, బయటకు వచ్చాక వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించడం కెమెరా కళ్లకు చిక్కింది. పెళ్లి పనుల కోసమే ఈ జంట ముంబై వెళ్లినట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మొత్తానికి సస్పెన్స్‌కు తెర పడిందని ఒకే కారులో ప్రయాణించి పెళ్లిని కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

ఇక ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూర్చుతూ, విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ సీఎంకు స్వయంగా పెళ్లి పత్రికను అందజేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 15న జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో, పెళ్లి వార్తలపై ఒక స్పష్టత వచ్చినట్లయింది. తాజా సమాచారం ప్రకారం.. వీరి వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఒక చారిత్రక ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. ఫిబ్రవరి 20 నుంచే సంగీత్, హల్దీ, మెహందీ వంటి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. వివాహానంతరం మార్చి మొదటి వారంలో హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Next Story