గంటల తరబడి విజయ్ అదే చూస్తాడు ఆ విషయం నచ్చలేదంటూ.. త్రిష ఆసక్తికర కామెంట్స్

by Disha Web Desk 6 |
గంటల తరబడి విజయ్ అదే చూస్తాడు ఆ విషయం నచ్చలేదంటూ.. త్రిష ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ త్రిష టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా ఎన్నో సినిమాలు చేసి స్టార్ డమ్ సంపాదించుకుంది. 20 ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుంది. పొన్నియన్ సెల్వన్‌తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ అమ్మడు ఎక్కువగా తలపతి విజయ్ మూవీస్‌లోనే నటించింది. అంతేకాకుండా స్క్రీన్‌పై వీరిద్దరి కెమిస్ట్రీకి ఎంతో మంది ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ అమ్మడు చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తోంది. తొందరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష విజయ్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ షూటింగ్ స్పాట్‌లో అందరూ సరదాగా గడిపే సమయంలో విజయ్ మాత్రం పక్కకు వెళ్లి ఓ మూలన కూర్చుని గంటల తరబడి గోడ వైపు చూస్తూ ఉంటాడు. అతను సెట్‌లో ఎప్పుడు సైలెంట్‌గా ఉండటమే కాకుండా ఎక్కువగా మాట్లాడడు. విజయ్ అందరితో కలిసిపోయి.. సరదాగా మాట్లాడితే చూడాలనిపిస్తుంది. కానీ అందరితో కలవడు.. అదే నాకు అతనిలో నచ్చని విషయం’’ అని చెప్పుకొచ్చింది. ఇక త్రిష పక్కనే ఉన్న విజయ్ మాట్లాడుతూ.. ‘‘ నేను గోడను చూడను. సీన్ గురించి ఆలోచిస్తాను. వాళ్లంతా కబుర్లు చెప్పుకుంటారు. కానీ నేను నెక్స్ట్ షాట్ ఏంటనీ అనుకుంటూ ఉంటాను’’ అని అన్నాడు. ప్రస్తుతం వీరిద్దరి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More..

అక్కడి వాళ్లకు మహేశ్ బాబు భార్య ఎవరో తెలుసు కానీ ప్రభాస్ తెలియదు.. డార్లింగ్‌పై రానా కామెంట్స్ వైరల్

Next Story

Most Viewed